టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన కల్లె మహేశ్ బాబు కు అభినందనలు
1 min read

కర్నూలు జిల్లా కురువ సంఘం…
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన కురువ కల్లె మహేశ్ బాబు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెలుగులో స్కోర్ 85.20 సాధించినందుకు కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం. కె. రంగస్వామి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ ప్రదానకార్యదర్శి అనిత ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, బి.వేంకటేశ్వర్లు కోశాధికారి కె సి నాగన్న సహయ కార్యదర్శి కోత్తపల్లి దేవేంద్ర, బి. సి. తిరుపాల్, పెద్దపాడు పుల్లన్న తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. కురువ కులస్థులు తమ పిల్లలకు విద్య నేర్పించాలని విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి సంఘానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

