NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు అందజేత..

1 min read

క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ ఆధ్వర్యంలో పంపిణీ

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  అంగన్వాడీ చిన్నారుల విద్య బలోపేతం కోసం క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ లిమిటెడ్‌ (ప్రైవేట్‌ సంస్థ)ఆధ్వర్యంలో విద్యార్థులకు కుర్చీలను అందజేసింది.నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్ వాడీ కేంద్రం-2 కేంద్రానికి చిన్నారుల కోసం-15 కుర్చీలు మరియు టీచర్లకు-5 కుర్చీలను అందజేశారు.ఏరియా మేనేజర్‌ కార్తీకేష్‌,నందికొట్కూరు బ్రాంచ్‌ మేనేజర్‌ కాటం మహేష్‌ ఆధ్వర్యంలో సోషల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం కుర్చీలను సంస్థ నిర్వాహకులు మరియు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు  అంగన్వాడీ కార్యకర్త సుజాతకు అందజేసినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాటం వెంకటేశ్వరలు,అంగన్వాడీ ఆయా శివలక్ష్మమ్మ,  శ్రీరాములు,లక్ష్మన్న,ఈశ్వరయ్య మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Author