ఘనంగా ముగిసిన ప్రజా దర్బార్
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజా దర్బార్) కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. విశేష స్పందన నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, తమ సమస్యలను వైకుంఠం జ్యోతి దృష్టికి తీసుకువచ్చారు.భరోసా: అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు.మీ నమ్మకమే మా బలం – మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం”ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు మరియు ముఖ్యంగా ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.


