ప్రజాసేవలో చంద్రన్న 15 ఏళ్ల మైలురాయి…
1 min read
హోళగుంద టీడీపీ నాయకులు…
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సాంకేతికత, పారదర్శక పరిపాలనకు ప్రతీకగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజుతో మొత్తం 15 సంవత్సరాలు సీఎంగా పూర్తి చేసుకున్నారు అని టీడీపీ హర్షం వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ప్రజా సేవకు అంకితభావంతో,రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి పునాది అని, రాజధాని నిర్మాణం నుంచి సమాచార సాంకేతిక రంగ అభివృద్ధి వరకు,ప్రతి రంగంలోనూ దూరదృష్టి, క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిననాయకునిగా చంద్రబాబు నాయుడు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని అన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ ఈ సందర్భాన్ని గర్వకారణంగా భావిస్తూశ్రీ చంద్రబాబునాయుడు కి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు… ఈ కార్యక్రమంలో ఆలూరు మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పంపాపతి, టీడీపీ సీనియర్ నాయకులు దొడ్డి వెంకటేష్ , మాజీ జడ్పీటీసీ రామ్ భీం నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ యెర్రీశ్వామి, సీనియర్ నాయకుడు తిప్పన్న, సన్నయ్య స్వామి, టిడిపి యువ నాయకులు మంజునాథ గౌడ్, ఆంజనేయులు జాకీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

