PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రశేఖర్​ రెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం

1 min read
ప్రొఫెసర్​ చంద్రశేఖర్​ రెడ్డిని సన్మానిస్తున్న కార్డియాలజి వైద్యులు

ప్రొఫెసర్​ చంద్రశేఖర్​ రెడ్డిని సన్మానిస్తున్న కార్డియాలజి వైద్యులు

పల్లెవెలుగువెబ్​, కర్నూలు హాస్పిటల్​: విధి నిర్వహణలో.. అంకితభావం, మరెందరికో.. స్ఫూర్తిదాయకంగా నిలిచిన కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి డెర్మటాలజి విభాగాధిపతి, వైద్య కళాశాల వైస్​ ప్రిన్సిపల్​ డా. ఐ. చంద్రశేఖర్​ రెడ్డి సేవలు… ఆదర్శమని కార్డియాలజి విభాగాధిపతి డా. పి. చంద్రశేఖర్​ అన్నారు. బుధవారం పదవి విరమణ పొందిన డెర్మటాలజి విభాగాధిపతి డా. ఐ. చంద్రశేఖర్​ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని కార్డియాలజి విభాగానికి సంబంధించిన హాల్​లో జరిగిన ఆత్మీయ వీడ్కోలు సభలో కార్డియాలజి విభాగాధిపతి డా. పి. చంద్రశేఖర్​ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి, వైద్యకళాశాలకు డెర్మటాలజి ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వైద్యవిద్యార్థులు, జూనియర్​ వైద్యులు, సిబ్బంది డెర్మటాలజి ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్డియాలజి విభాగం వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author