ఏపీ ఉపాధ్యాయ శాశ్వత బదిలీ చట్టం-2025లో మార్పులు చేయాలి
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ శాశ్వత బదిలీ చట్టం 2025లో కొన్ని మార్పులను చేయాలని ఎస్ టి యు జిల్లా ఆర్థిక కార్యదర్శి ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం పత్తికొండ స్థానిక ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో ఎస్టియు మండల శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన అత్యవసర మండల కార్యవర్గ సమావేశం జరిగింది .ఈ సమావేశానికి కర్నూలు జిల్లా ఆర్థిక కార్యదర్శి ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ శాశ్వత బదిలీ చట్టం- 2025 లో కొన్ని మార్పులు చేయవలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .బదిలీల ప్రక్రియలో ఏదైనా అన్యాయం జరిగితే న్యాయపోరాటానికి ప్రభుత్వం చే నియమించబడ్డ ప్రత్యేక అధికారి రాతపూర్వక అభ్యంతరం మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకునే విధంగా అందులో చేర్చారు. దీనికి తోడుగా ప్రభుత్వం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా స్థాయి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా అవివాహిత మహిళలకు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రత్యేక పాయింట్లు ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. బదిలీ అనే నిర్వచనం ను పాఠశాల నుండి పాఠశాలకు కాకుండా ఆవాస ప్రాంతం నుండి ఆవాస ప్రాంతం తీసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. సాధారణ బదిలీ సమయంలో తప్ప తక్కిన ఏ సమయంలోనైనా ఉపాధ్యాయ బదిలీలు ప్రభుత్వం చేపట్ట రాదని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు సీనియర్ నాయకులు నారాయణ, సత్యనారాయణ, చంద్ర శేఖర రెడ్డి, చెన్నకేశవరావు, బీరప్ప, వెంకట్రాముడు, రాఘవేంద్ర, కృష్ణమూర్తి ,ఇక్బాల్ హుస్సేన్,సూరి, ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.