విద్యా హక్కు చట్టం (ఆర్ టి ఇ) లో మార్పులు చేయాలి
1 min read
ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థలపై ఒత్తిడి
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పొడిగించాలని డిఈఓ
యం.వెంకట లక్ష్మమ్మ కి వినతి పత్రం
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వెనుకబడిన వర్గాల ప్రజల కోసం ఏర్పాటు చేయబడిన విద్యాహక్కు చట్టం (ఆర్ టి ఈ) 12(1సి) 25% శాతం ఉచిత విద్య జీవో నీ గత ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే, వకటవతరగతి చదివే విద్యార్థులకు ఉచిత విద్య కోసం మళ్లీ ఈ విద్యాసంవత్సరం అనగా 2025- 26 ఖచ్చితంగా అమలు చెయ్యాలని ప్రభుత్వం అధికారులు ప్రైవేట్ యాజమాన్యంలను వత్తిడి చేస్తున్నారు. కానీ ప్రైవేట్ యాజమాన్యాలు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువు పొడిగించాలని ఈరోజు ఏలూరు జిల్లా విద్యాశాఖ ధికారిణి యం.వెంకట లక్ష్మమ్మని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. విద్యాహక్కు చట్టానికి 25% ప్రవేశాలకు మేము వ్యతిరేకులం కాము కానీ గత మరియు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శక లేని విధంగా జి.ఓ నీ అమలు చేస్తున్నాయనివాపోతున్నారు. ఎందుకంటే పాఠశాల మౌలిక వసతులు దృష్టిలో పెట్టుకుని ఫీజులు నిర్ణయించాలి ఎటువంటి అవగాహన లేకుండా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ హడావుడిగా ఉత్తర్వులు జారీచేశారు.ఆ రెండు సంవత్సరాలు ఉచిత విద్య ప్రవేశాలు ప్రక్రియ చెల్లవు అని హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. కానీ కోర్టు ధిక్కరణలో భాగంగా తిరిగి మళ్లీ కోర్టులో వాదోపవాదాలు జరుగుచుండగా మళ్ళీ అడ్మిషన్లు ఇవ్వాలని లేదంటే ప్రభుత్వ గుర్తింపులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీట్చేస్తున్నారు. వకప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతో ఉచిత హాస్టల్ విద్యను అందించిన ప్రైవేట్ పాఠశాలలకు రాష్ట్రంలో వేలకోట్లు బకాయిలు ఉన్నాయి రెండు ప్రభుత్వాలు చెల్లించలేదు. గత మూడు సంవత్సరాలుగా విద్యా హక్కు చట్టం అమలు చేయడం ద్వారా ఏలూరు జిల్లాలో మొత్తం మీద ఏటా 800 నుండి 900 అడ్మిషన్స్ నిమిత్తం ప్రభుత్వం నుండి వక్కో జిల్లాకు సుమారు రెండు కోట్ల రూపాయలు బకాయిలు బడింది. వక్క పైసా కూడా ప్రభుత్వం చెల్లించలేదు. కేవలం ఉచిత విద్య కోసం తల్లిదండ్రులు అబద్ధపు దృవ పత్రాలు సమర్పిస్తున్నారు. పుస్తకాలూ ఉచిత విద్యలో భాగమని వాదిస్తారు, జీవో ప్రకారం కేవలం 1కిలోమీటర్ దూరంలోపు వారికి దగ్గరలో పాఠశాలను కేటాయించాలి కానీ 3 కిలోమీటర్లు పై బడిన వారికి కూడా ప్రవేశాలు కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాలు పేరుతో ప్రభుత్వాలు వక్కోక విద్యార్థికి 15000/- చెప్పినవిధంగా ఆర్ టి ఇ ఉచిత అడ్మిషన్ పొందిన ప్రతీ స్కూల్ కి నిలిచిన బకాయిలు చెల్లించాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పాఠశాలలను ప్రారంభించాలి ఇదీ కనీస భాధ్యత గా గుర్తించి న్యాయం చెయ్యాలని అని కోరుతున్నామన్నరు. జిల్లా అధ్యక్షులు శివకుమార్ శర్మ, కార్యదర్శి ఎన్.ఆర్.కె.ఎ ప్రసాద్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ యం.బి.ఎస్ శర్మ , వెంకటేశ్వరరావు, సతీష్, శేఖర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అప్పటివరకు అడ్మిషన్స్ ప్రక్రియ గడువు పొడిగించాలని కోరుతున్నాం అని తెలియజేశారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందించి తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వచ్చేవరకు రాష్ట్ర అపుస్మా నాయకుల పిలుపు మేరకు ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ చెయ్యమని తేల్చి చెప్పడం జరిగింది.