NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల్య వివాహాల ద్వారా పిల్లల జీవితాల్లో సమస్యలు…ఎంపీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: బాల్యం అనేది అమూల్యమైన దశ అని, బాల్య వివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం మరియు శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…బాల్య వివాహ విముక్తి భారత్ పేరుతో కోనేరు ఎన్.జీ.ఓ సంస్థ,  మహిళా, శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా చేపట్టిన వంద రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా  రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. .. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయి జీవితాంతం సమస్యలు ఎదురవుతాయని, ఈ దురాచారాన్ని అరికట్టడానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు…ఈ కార్యక్రమంలో కోనేరు సంస్థ కోఆర్డినేటర్ మౌనిక,సి ఎస్ ఎం రామాంజనేయులు, ఏరియా కోఆర్డినేటర్ మునుస్వామి, గ్రామ ఆశ వర్కర్లు  తదితరులు పాల్గొన్నారు.

About Author