NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అరెస్టులపై అంగన్వాడీల నిరసన..

1 min read

మాట్లాడుతున్న ఏఐటీయూసీ అంగన్వాడి వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్

చాగలమర్రి, న్యూస్​ (నేడు ): అంగన్వాడీల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న మహిళలను అరెస్టు చేయడం దారుణం అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వేతనాల కోసం ఉద్యమం చేస్తుండగా ఎటువంటి న్యాయం చేయకపోవడంతో రాష్ట్ర కమిటీ సమ్మెకు పిలుపునిచ్చిందన్నారు. వేతనాలు పెంచి పలు డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి మహిళా ఓట్లతో అధికారం చేపట్టి నిర్లక్ష్యం చేయడం దారుణం అన్నారు. ధరలకు అనుగుణంగా వేతన చట్ట ప్రకారం వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అంగన్వాడీల తో చర్చలు జరిపి న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కరించాలని కోరారు.

About Author