అంగన్వాడీల అక్రమ అరెస్టులకు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన
1 min read
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి….
న్యూస్ నేడు, పత్తికొండ : తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ నగరంలో నిరసన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధ చర్య అని, సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను భయభ్రాంతుల కు గురిచేయాలని ప్రయత్న చేయడం దుర్మార్గమైన చర్య అని, అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ (సిఐటియు) ప్రాజెక్టు కార్యదర్శి జ్యోతిలక్ష్మి లు డిమాండ్ చేశారు.దేవనకొండ మండల కేంద్రంలో మంగళవారం నాడు స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు అంగన్వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని యూనియన్ నాయకురాలు మమత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వీర శేఖర్,జ్యోతిలక్ష్మి లు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల ముందు అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసినా సందర్భంగా నాడు ప్రతిపక్షంలో ఉన్న నేటి కూటమి నాయకులు నాయకులు టెంట్లు దగ్గరికి చేరి మీ సమస్యలు పరిష్కరిస్తాం ,మీకు వేతనాలు పెంచుతామని హామీలు గుప్పించిన విషయం మరిచిపోయారని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్న హామీ లు నేటికీ అమలు కావడం లేదని పేర్కొన్నారు.

