NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్ననాటి స్నేహితులు..నేటి కలయిక

1 min read

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

ఓర్వకల్లు న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఓర్వకల్లుమండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆనాడు నెంబర్ వేసుకున్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ 1997-98 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ద్వారా ఒకరినొకరు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.కష్టసుఖాల్లో పాలుపంచుకుందాం అంటూ వారి జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి వారి కుటుంబ స్థితి గతుల గురించి పాఠశాలల్లో చదువుకున్న పాత విద్యార్థులు అంతా ఒకచోట చేరి చదువుకునే రోజుల్లో అల్లరి చేసిన జ్ఞాపకాలు గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని ఆనందంతో పరవశించిపోయారు.వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ మన తోటి విద్యార్థులు యోగ క్షేమాలను వేదికపై పంచుకున్నారు.ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే తల్లిదండ్రులతో పాటు విద్య నేర్పిన గురువులకు గుర్తింపు ఉంటుంది అన్నారు.ఏ స్థాయిలో ఉన్న దాని వెనుక మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. అనంతరం విద్యార్థుల్లో కూడా కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకొని  చిరు సన్మానాన్ని జ్ఞాపికలను అందుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రామచంద్రా రెడ్డి, పూర్వ ఉపాధ్యాయులు నూరుద్దీన్,రత్నమయ్య, అసాధ్య సత్యనారాయణ, జేఎస్ఆర్.కే శర్మ,ఓబులేష్, సుంకన్న,శ్రీకాంత్,విద్యార్థులు ఆనంద్,నాగేంద్ర,అయూబ్, విజయలక్ష్మి,బషీరున్నిసా,మహేశ్వరీ,రమణకుమారి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *