NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి త్వరలో చర్యలు

1 min read

: ఎమ్మెల్యే  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి

ప్యాపిలి ( న్యూస్ నేడు)  : ప్యాపిలి పట్టణంలోని చారిత్రాత్మక, పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానాన్ని  డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సోమవారం సందర్శించి ఆలయ పరిస్థితిని పరిశీలించారు.ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆలయంలోని కొన్ని భాగాలు దెబ్బతినడంతో పాటు భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే , ఆలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు. ఆలయ పునర్నిర్మాణం, మరమ్మతు పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, చారిత్రాత్మక దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.స్థానిక ప్రజలు,ఎమ్మెల్యే కి ఆలయ సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే  భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో స్థానిక భక్తులు,  ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, తెదేపా నాయకులు ఖాజా ఫీర్, తేదేపా పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు,తేదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర , తేదేపా ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మదు కుమార్, మాజీ ఎంపీటీసీ గొల్ల రామ్మోహన్ యాదవ్, తేదేపా నాయకులు సుధాకర్ గుప్తా, గండికోట పెద్ద రామాంజనేయులు,క్రిష్ణ మొహన్,కడితం ప్రతాప్ రెడ్డి,గుడిపాడు వెంకటరెడ్డి, పుల్లయ్య, వెంకటేష్, బాలకృష్ణ, మరియు ఆలయ అర్చకులు వెంకటేష్, నాగేంద్ర రాజు,వెంకట రమణయ్య మరియు  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *