ప్రతి నెల మాట నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం…
1 min read
యనమలకుదురు, న్యూస్ నేడు: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గం లకే ప్రతి ఇంటికి వెళ్లి వృద్ధులకు , వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ లుఅందించి వారికి అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం.జూన్ నెల 1తేదీన పెన్షన్ ప్రతి గడపకుజాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ సిఎం శ్రీ నారాచంద్రబాబు నాయుడు సంకల్పం తో శాసనసభ్యుల బోడే ప్రసాద్ ఆదేశాలతో ఈరోజు యనమలకుదురు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, పెన్షన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడగగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనీ స్థానిక ప్రజలు ఆన్నారు.తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు మంచి చేయుట కొరకు పెట్టిన పార్టీ. మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు ఎన్ని ఇబ్బందులు ఉన్న అవ్వ తాతలకు, వితంతువులకు, వికలాంగులకు ఇంటి పెద్ద కొడుకై ప్రతినెల ఒకటో తారీకునే ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు ఇంటికొచ్చి పెన్షన్ అందజేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో నడవాలంటే నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అక్కడి ప్రజలు కోరారు.శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్న, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరగాలన్న అది ఒక చంద్రబాబు నాయుడు సాధ్యమని, బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని,రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న, పేద ప్రజలకు ప్రతి నెల ఒకటో తారీకు నే పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించు కోవటం మనందరి బాధ్యత అన్నారు.కార్యక్రమంలో భూఖ్య రాజ రామాను యువరాజు చిర్రావూరి శేషు తాడిశెట్టి ప్రసాద్ కూటమి నాయకులు పాల్గొన్నారు.


