NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భాష్యం పాఠశాలలో బాలల దినోత్సవం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూల్ స్థానిక ఎన్ ఆర్ పేట భాష్యం పాఠశాలలో ఈరోజు బాలల దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. భాష్యం పాఠశాలల చైర్మన్ భాష్యం రామకృష్ణ , వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు , మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్  ఆదేశాల మేరకు భాష్యం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం నీ జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ వన్ జోనల్ ఇంచార్జ్ అనిల్ కుమార్  మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు మరియు ప్రతి విద్యార్థి వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయ్యే విధంగా వాళ్లకి సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ  పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు బాలల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరియు జోహార్ లాల్ నెహ్రూ కి పిల్లలు అంటే ఎంతో ఇష్టం ఆయన పుట్టినరోజు సందర్భంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బాలలదినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అని చెప్పారు. ప్రైమరీ పిల్లలు నెహ్రూ  వేషధారణలో స్కూల్ కి రావటం జరిగింది.ఈ సందర్భంగా పిల్లలకి అకాడమిక్స్ ప్రైసెస్, గేమ్స్ఛాన్స్ ప్రైసెస్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛాంప్స్ ప్రిన్సిపల్ మాధవి , అక్కడమిక్స్  ప్రిన్సిపల్ శరల్ జ్యోతి , వైస్ ప్రిన్సిపల్ రవి, స్వాతి మరియు ఇన్చార్జులు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

About Author