క్రైస్తవుల 40 రోజులు ఉపవాస సిలువ ధ్యాన ప్రార్థనలు ప్రారంభం
1 min read
సెయింట్ మైకేల్ చర్చ్ లో ప్రారంభించిన రెవరెండ్
ఫా:దిరిశిన ఆరోను
గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో దీక్ష దారులకు అల్పాహారం ఏర్పాటు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద సెయింట్ మైఖేల్ ఆర్ సి యం చర్చ్ ప్రాంగణంలో క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే విభూది బుధవారం 40 రోజులు మాల ధారణతో ఉపవాస సిలువ ధ్యాన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. వారికి ఉదయం 7 గంటలకు దివ్యబలి పూజ అనంతరం రెవరెండ్ ఫాదర్:దిరిశిన ఆరోను జపమాలలు వేసి ఆశీర్వదించారు.అనంతరం సాయంత్రం సిలువ మార్గం ప్రార్థనలు చేసి మాల ధారణ దీక్షాపరులకి సుమారు 300 మందికి గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ సభ్యులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు సొంగ మధు, జాయింట్ సెక్రెటరీ,యర్రా జయదాస్, ట్రెజరర్ పావని జ్యోతి, బాలరాజు, ఎబి ఆనంద్ మరియు సంఘ పెద్దలు,సంఘ కాపరులు పాల్గొన్నారు.