NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు టిడిపి కార్యాలయంలో సీఎం రివాల్వింగ్ ఫండ్ చెక్కుల పంపిణీ

1 min read

దళిత నాయకుడు నాగప్పకు ఆర్థిక సహాయం అందజేత

నిరుపేదలకు అండగా సీఎం రివాల్వింగ్ ఫండ్ వైకుంఠం జ్యోతి

టిడిపి నేతల సమక్షంలో ఘనంగా కార్యక్రమం నిర్వహణ

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వ పథకాలు

హోళగుందన్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంఆలూరు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి రివాల్వింగ్ ఫండ్ చెక్కును వైకుంఠం జ్యోతి  మరియు ఐటీడీపీ నాయకులు హనుమంతు (జార్జ్) చేతుల మీదుగా దళిత సీనియర్ నాయకుడు నాగప్ప కి అందజేశారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా బలంగా నిలుస్తూ సీఎం రివాల్వింగ్ ఫండ్ ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజలకు గొప్ప భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నాయకుడు హనుమంతు (జార్జ్), తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాల్మీకి ముద్దుబిడ్డ మల్లి, దళిత సీనియర్ నాయకుడు నాగప్ప, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు మరియు ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author