ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ప్రజాల నుండి వినతి పత్రాలు స్వీకరణ
సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు నియోజకవర్గంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అన్ని విధాలా కృషిచేస్తున్నామన్నారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. నిత్యం ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తున్న ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కూడా నియోజకవర్గానికి చెందిన పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. వాటన్నింటినీ స్వయంగా పరిశీలించిన ఆయన. సమస్యల పరిష్కారానికి సంబందిత అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు ఇళ్ళ సమస్యలు, ఫెన్షన్లు, అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై ఎమ్మెల్యేను కలిసి, వినతిపత్రాలు అందించగా వారందరితో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన… సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందుతోందని, అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఏలూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
