NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

1 min read

నాటిన ప్రతి మొక్క జీవించి ఎదిగేలా చూడాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి..

నందికొట్కూరు న్యూస్ నేడు: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా కేజీబీవీ బాలికల పాఠశాల మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు.జిల్లాలో చేపడుతున్న హరితాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి పాఠశాల ఆవరణంలో పచ్చదనంతో నింపాలన్నారు.ప్రాంగణాల్లో చేపట్టిన అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి మొక్కల పెంపకం, సంరక్షణ,నీటి వసతి తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.గురుకుల పాఠశాలలో అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ కింద జరుగుతున్న ఉద్యానవన పనులను పరిశీలించారు.ప్రాంగణంలో మొక్కలతో పచ్చదనంతో నింపాలని మొక్కలు నాటడం ద్వారా విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించవచ్చని కలెక్టర్ తెలిపారు.నాటిన ప్రతి మొక్క జీవించి ఎదిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మొక్కల సంరక్షణ బాధ్యతను పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు,విద్యార్థులు భాగస్వామ్యంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వాములు కావాలని ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను దత్తత తీసుకుని మొక్కల సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.గురుకుల పాఠశాలలో డైనింగ్ హాల్‌ను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత పరిశుభ్రత ప్రమాణాలు తాగునీరు,తదితర వసతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ పి సత్యనారాయణమూర్తికి కలెక్టర్ సచించారు.

About Author