NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్వుల పంపిణీ

1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి కె.వెట్రి సెల్వి

మరింత ఆధునీకరించే దిశగా జిల్లా యంత్రాంగం కీలక అడుగు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలను (ఏ డబ్ల్యూ  డబ్ల్యూ ఎస్ ) మరింత ఆధునీకరించే దిశగా జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. సోమవారం జిల్లా వట్లూరు-1 అంగన్వాడి కేంద్రం లో  ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి  జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ (విద్యుత్) స్టవ్వులను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి మాట్లాడుతూ  గ్యాస్ సిలిండర్ల లభ్యతతో సంబంధం లేకుండా, త్వరితగతిన, సురక్షితమైన వాతావరణంలో అంగన్‌వాడీ చిన్నారులు, గర్భిణులకు, బాలింతలు పౌష్టికాహారాన్ని వండి వడ్డించేందుకు ఈ ఇండక్షన్ స్టవ్వులు ఎంతగానో దోహదపడతాయన్నారు. పర్యావరణహితమైన, పొగలేని వంట గదుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని అన్ని కేంద్రాలకు వీటిని అందిసున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి (డి డబ్ల్యూ సి డబ్ల్యూ & ఈఓ)  పి. శారద,పెదపాడు తహసీల్దార్ కృష్ణ జ్యోతి, పెదపాడు ఎంపిడిఓ  ఆమిల్ జమ్మద్,అగ్రికల్చర్ ఏ ఓ షేక్ ఇమామి ఖాసీం,సీడీపీఓ ఏ. పద్మావతి, సూపర్‌వైజర్ కె.మేరీబాయమ్మ , సూపర్‌వైజర్ కె.కుమారి,అధికారులు మరియు  అంగన్‌వాడీ కార్యకర్తలు (ఏ డబ్ల్యూ డబ్ల్యూ ఎస్ ) పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల వంట చేయడం మరింత సులభతరం అవుతుందని, సమయం ఆదా అవుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *