స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్ (SGLR) సిస్టం పై కలెక్టర్ సమావేశం
1 min read
పర్యాటకులకు స్వచ్ఛత, శుభ్రత కలిగిన సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్ సిస్టం
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : పర్యాటకులకు స్వచ్ఛత, శుభ్రత కలిగిన సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్ ను ప్రకటించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు.బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్ (SGLR) సిస్టం పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్న హౌటల్స్, రెస్టారెంట్లు, హౌమ్ స్టే లు, ధర్మశాలలు, లాడ్జి లకు స్వచ్ఛతా గ్రీన్ లీఫ్ రేటింగ్ ను ప్రకటించడం జరుగుతుందన్నారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, మానవ వ్యర్ధాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ ల ఆధారంగా వీటికి రేటింగ్ ప్రకటిస్తారన్నారు..టాయిలెట్ సదుపాయాలు వాటి నాణ్యత ప్రమాణాలు, సురక్షిత పారిశుద్ధ్య సౌకర్యాలు, ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వాహణ, తడి పొడి చెత్త వేరు చేసే విధానం లాంటి ప్రక్రియలను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఆతిథ్య రంగంలో పరిశుభ్రత పాటించడం, పారిశుధ్యం కోసం మెరుగైన పద్ధతులను అవలంబించడం ఈ సిస్టమ్ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు… పర్యాటక ప్రదేశాలలో పరిశుభ్రత, పారిశుధ్యం ఉండేలా దృష్టి పెట్టాలని, హోటల్‌లు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, సేవల వినియోగాన్ని ప్రోత్సహించాలని, పరిశుభ్రత గురించి పర్యాటకులకు అవగాహన కల్పించే విధంగా టూరిజం శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ లు ఈ అంశానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఆతిథ్య సంస్థల స్టేక్ హోల్డర్ లకు ఈ సిస్టమ్ గురించి జిల్లా, డివిజనల్ స్థాయిలో వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆర్డబ్లూఎస్, టూరిజం, పంచాయతీ అధికారులను ఆదేశించారు… డివిజనల్ స్థాయి కమిటీలు వారి పరిధిలో పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఆతిథ్య సంస్థలను పరిశీలించి నివేదికలను జిల్లా స్థాయి కమిటీ కి మార్చి 31 వ తేది లోపు నివేదికను పంపించాలని, వాటిని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజనల్ స్థాయి కమిటీ చైర్మన్ కు అయిన ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను ఆదేశించారు.సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వర రావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి విజయ, డిపిఓ భాస్కర్, ఏపీ టూరిజం కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
