నీటి సమస్య మరమ్మతులను చేయించిన కమిషనర్..
1 min read
మున్సిపాలిటీ కమిషనర్ బేబీ..
పల్లెవెలుగు, నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కర్నూలు గుంటూరు కేజీ రహదారి శ్రీ చాడేశ్వరీ దేవాలయం ఎదురుగా త్రాగునీటి పైపు లైన్ పనులను నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ సిబ్బందితో కలిసి మంగళవారం పరిశీలించారు.పట్టణంలో నీటి సమస్య తలేత్తకుండా ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకొని పట్టణంలో అన్ని లైన్స్ వాటర్ వచ్చే విధంగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలో నీటి సమస్య రాకూడదని ఉద్దేశంతో మున్సిపాలిటీ కమిషనర్ అక్కడే ఉండి మరమ్మత్తు పనులను పూర్తి చేయించారు. గత నెలలోనే ఇదే స్థానంలో పైపులు లీకేజీ ఉంటే అధికారులు మరమ్మతులు చేయించారు.మళ్లీ లీకేజ్ వస్తూ ఉండడంతో మళ్లీ నీటి సమస్య రాబోయే రోజుల్లో లీకేజీ కాకూడదనే ఉద్దేశంతో కమిషనర్ సిమెంట్ పైపులతో స్టాండర్డ్ గా ఉండేందుకు పైపులను వేయించారు.ఈ కార్యక్రమం లో మునిసిపల్ డీఈ నాసిర్,ఏఈ దినేష్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.