30 న కామన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్
1 min read
పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబడవు.
కామన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ
కర్నూలు , న్యూస్ నేడు : కామన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ నిర్వహణకు పగడ్బందిగా ఏర్పాట్లు చేయాలని డిఆర్ఓ సి.వెంకటనారాయణమ్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ఈనెల 30 వ తేదీన నిర్వహించే కామన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా రెవిన్యూ అధికారి సి.వెంకటనారాయణమ్మ సమావేశము నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల 30 వ తేదిన నిర్వహించే కామన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో 12 సెంటర్లల లో 4584 మంది, ఆదోని లోని 10 సెంటర్లలో 2768 మంది మొత్తం 22 సెంటర్లలో 7352 మంది విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. ఈ పరీక్షలు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబడవని అన్నారు,ఏపీ ఎస్పీడీసీఎల్ వారు పరీక్ష కేంద్రాల్లో కరెంటు అంతరాయం లేకుండా చూడాలని, పోలీసు అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, మున్సిపల్ వారు పరీక్ష కేంద్రాల వద్ద త్రాగు నీటి సదుపాయం కలిగించాలని, వైద్య ఆరోగ్యశాఖ వారు పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవసరమైన ప్రధమ చికిత్స కు సంబంధించిన మెడిసిన్స్ అందుబాటులో ఉంచుకోవాలని డిఆర్ఓ సంబంధిత అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో విజయశ్రీ, పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఓ శ్రీధర్ , కర్నూలు రూరల్ తహశీల్దార్ రమేష్ బాబు, అర్బన్ తహశీల్దార్ వెంకటలక్ష్మి, ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది, పోలీస్ శాఖ వారు, వైద్య ఆరోగ్యశాఖ వారు, తదితరులు పాల్గొన్నారు.