NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్  దాసి.రోజ్ మేరీ పదవీ విరమణ

1 min read

ఘనంగా సన్మానించనున్న డాక్టర్లు,పి హెచ్ సి సిబ్బంది,

కుటుంబ సభ్యులు ఉన్నత అధికారులచే ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసలు,ప్రజాలకు మెరుగైన సేవలు

నేడు ఎస్.వి.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ లో వీడ్కోల సభ ఏర్పాటు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :  పెదవేగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్( సి హెచ్ ఓ) గా విధులు చేపట్టి ప్రజల మన్ననలు,అధికారుల ప్రశంసలు అందుకున్న డి రోజ్ మేరీ పదవీ విరమణ పొందారు, రోజ్ మేరీ ఏలూరు నివాసి,ఆమె వైద్య శాఖలో స్టాఫ్ నర్స్ గా శిక్షణ పొంది తొలిసారిగా కృష్ణా జిల్లా భూసవరం ,బాపులపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో స్టాఫ్ నర్స్ గా పనిచేశారు,అనంతరం వైద్య విద్యలో పి జి చేసి  వైద్య సిబ్బందికి ట్యూటర్ గా పనిచేశారు,పి హెచ్ సి ల పరిధిలో విధులు నిర్వహించే గ్రామ స్తాయి వైద్య సిబ్బందికి పరిసరాల పరిశుభ్రత వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, గ్రామాలలో సీజనల్ గా వ్యాపించే వ్యాధులైన  మలేరియా,టైఫాయిడ్,కోరినంత దగ్గు,న్యుమోనియా,వంటి వ్యాధుల వ్యాప్తి వారి నిర్మూలన కు తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు పై వైద్య సిబ్బందికి పూర్తి అవగాహన కల్పిస్తూ శిక్షణ నిచ్చేవారు,వయసు పరమ గా ఎదుగుతున్న బాలికల్లో వచ్చే శారీరక మార్పులు, రుతు క్రమాలు,అక్రమ సక్రమ శారీరక సంబంధాల వల్ల వచ్చే లైంగిక వ్యాధులు తీసుకోవాల్సిన వైద్య చికిత్సల పై వైద్య సిబ్బందికి,అంగన్వాడీ వర్కర్ లకు అర్థమయ్యే రీతిలో బోధించి ఆరోగ్యం పట్ల పట్ల గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి మంచి ట్యూటర్ గా గుర్తింపు పొందారు,అనంతరం రోజ్ మేరీ 2004 లో పెదవేగి ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సి హెచ్ ఓ గా విధులు చేపట్టి మంచి అధికారిగా ప్రజల్లో పేరుతెచ్చుకున్నారు,2014 లో పెదవేగి నుండి భీమవరం దగ్గర ఉండి  పి హెచ్ సి కి సి హెచ్ ఓ గా  బదిలీ పై వెళ్ళారు,అక్కడనుండి 2022 లో తిరిగి పెదవేగి పి హెచ్ సి కి బదిలీ పై వచ్చారు,ఇక్కడ విధులు నిర్వహిస్తూ 2025 జూన్ లో పదవీ విరమణ పొందారు,ఈ సందర్భంగా పెదవేగి మండల స్తాయి వైద్య సిబ్బంది రోజ్ మేరీ నీ ఈ నెల అనగా జూన్ 28/6/2025 శనివారం   నాడు న్యాయం పల్లి లో ఉన్న ఎస్ వీ ఎస్ ఆర్ పంక్షన్ హాల్ లో ఘనం గా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు,ఈ సందర్భంగా పెదవేగి వైద్య సిబ్బంది దాసి. రోజ్ మేరీ కి ఆత్మీయ పదవి విరమణ వీడ్కోలు మరియు అభినందన సభ నిర్వహించి రోజ్ మెరీని వైద్యసిబ్బంది ఘనంగా సన్మానించనున్నారు.

About Author