గుజరాత్ ప్రతిష్ఠ దెబ్బతీసే కుట్ర !
1 min readపల్లెవెలుగువెబ్ : గుజరాత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, పెట్టుబడులు ఆగిపోయేలా చేసేందుకు కుట్రలు జరిగినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భుజ్ జిల్లాలో అదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, గుజరాత్‌ను దేశ విదేశాల్లో అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు జరిగాయని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పదేపదే ప్రయత్నాలు జరిగాయని, అయినప్పటికీ గుజరాత్ అభివృద్ధి మార్గాన్ని ఎంచుకుందని అన్నారు.