ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
నగరంలోని వివిధ ప్రాంతాల్లో విసృత పర్యటన
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతర కృషి చేస్తున్నట్లు నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు. మంగళవారం ఆయన అశోక్ నగర్, ఆనంద్ థియేటర్ సమీపంలోని శ్రీ బసవ సర్కిల్, గడియారం ఆసుపత్రి, అమీర్ హైదర్ నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. హంద్రీ నదిలో జరుగుతున్న ముళ్ళ పొదల తొలగింపు పనులను కమిషనర్ పరిశీలించారు.ఆనంద్ థియేటర్ సమీపంలో కిసాన్ ఘాట్ వెళ్ళు మార్గాన కూడలి ఏర్పాటుకు, గడియారం ఆసుపత్రి ఆధునికీకరణ పనులను చేపట్టడానికి ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అక్కడే జరుగుతున్న పలు అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే అమీర్ హైదర్ నగర్ కాలనీలో రహదారుల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రాజ్‌వీహర్ సమీపంలో హంద్రీ నదిలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ సూచించారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, డిఈఈ గంగాధర్, పారిశుద్ధ్య తనిఖీదారులు వలి, మునిస్వామి, లోకేష్, షాకీర్, తదితరులు పాల్గొన్నారు.