విశ్వకర్మ వల్లే చేతివృత్తులు అభివృద్ధి చెందాయి
1 min read

కలెక్టరేట్లో ఘనంగా విశ్వకర్మ జయంతోత్సవం
బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య
నంద్యాల, న్యూస్ నేడు: శ్రీ విరాట్ విశ్వకర్మ వల్లే చేతివృత్తులు అభివృద్ధి చెందాయని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య మాట్లాడుతూ…విశ్వకర్మ వల్లే చేతివృత్తులు అభివృద్ధి చెందాయని కత్తి, సుత్తి, కొడవలి లాంటి చేతి వృత్తుల పరికరాలు విశ్వకర్మ తయారు చేశారని, ఎన్నో దేవతా విగ్రహాలకు రూపాన్ని ప్రపంచానికి విశ్వకర్మ ఇచ్చారన్నారు. నేడు ఆయన జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరు ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సుభాకర్, డోన్ అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ ఓబులేసు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, జిల్లాలోని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

