వినోద వసతుల అభివృద్ధికి చర్యలు
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం నగరంలోని ప్రజలకు మెరుగైన వినోద సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన జొహరపురం రోడ్డులోని ఇండోర్ స్టేడియం, టెన్నిస్ కోర్టు, సి & డి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, అక్కడే ఉన్న మున్సిపల్ పార్క్‌ను పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు ఇండోర్ స్టేడియం చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం పూట వ్యాయామం, వినోదం కోసం వచ్చే ప్రజలు సౌకర్యంగా ఉపయోగించుకునేలా శుభ్రత పనులు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని, ప్రతి పౌరుడు ఈ సదుపాయాలను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే నగరం మరింత అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దబడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని వినోద సౌకర్యాల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, డిఈఈ నరేష్, ఏఈ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

