సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో డి. లాస్య రెడ్డికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు పట్టణ సమీపాన దిన్నెదేవరపాడు నందు గల కట్టమంచి సెకండరీ పాఠశాల (శ్రీ చైతన్య అకడమిక్ మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో నేడు దేశ వ్యాప్తంగా విడుదలైన 10వ తరగతి. సిబిఎస్ఈ పరీక్షా ఫలితాల్లో డి. లాస్యరెడ్డి అనే విద్యార్థిని . 496/500 మార్కులు సాధించి స్టేట్లోనే మొదటి స్థానంగా నిలిచి, జిల్లా స్థాయిలో ప్రభంజనం-సృష్టించింది. ఇందుకు గాను ఆ విద్యార్థినిని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వారు అభినందించారు.ఈ విజయాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఏ.జి.ఎం. శ్రీ సురేష్ పాఠశాల ఆర్.ఐ. శ్రీ రంగారెడ్డి ; ప్రిన్సిపల్ శ్రీమతి కీర్తి ; డీన్ శ్రీ పవన్ కుమార్ , పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు.