NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దసరా బన్నీ ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి

1 min read

ప్రజలకు అవగాహన కల్పించిన ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్సై దిలీప్ కుమార్

హోళగుంద న్యూస్ నేడు: నెరనికి గ్రామంలో రాబోయే దసరా బన్నీ ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆలూరు సీఐ రవిశంకర్ రెడ్డి, హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ, దసరా బన్నీ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాల సమయంలో ఎవరూ గొడవలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ సంయమనం పాటించాలని, ఎలాంటి గొడవలు, అల్లర్లకు పాల్పడకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని కోరారు.ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలపై ఎలాంటి నేరాలకు పాల్పడరాదని, మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కావద్దని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు పలు సూచనలు చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *