ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగం కొరకు సెలవు ప్రకటించాలి- ఆప్టా
1 min read
కర్నూలు న్యూస్ నేడు: ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా -గుంటూరు జిల్లాల మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్టణం ఉమ్మడి జిల్లాలు) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఓటర్లందరికీ ప్రత్యేక సెలవు మంజూరు చేసినప్పటికీ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయ సిబ్బంది మొత్తానికి ఓటు ఉన్న సందర్భంలో , అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఓటు ఉన్న సందర్భంలో ఈ పాఠశాలలన్నింటికీ డెప్యూటేషన్ ఏర్పాటు సాధ్యం కాని పరిస్థితి నెలకొనివుంది. కావున ఒక పాఠశాలలో సిబ్బంది మొత్తానికి ఓటు ఉన్నపుడు ఆయా పాఠశాలలకు సెలవు ప్రకటించవలెనని ఆప్టా పక్షాన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి , విద్యా శాఖ అధికారులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు లేఖ ద్వారా ప్రాతినిథ్యం చేయటం జరిగింది. సెలవు ప్రకటించని పక్షం లో ఓటింగ్ శాతం తగ్గి ఫలితాల పై ప్రభావం చూపించే అవకాశం వుంది. కాబట్టి ఈ విషయం యందు తగు నిర్ణయం తీసుకోవాలని వారు రాష్ట్ర ఎన్నికల అధికారికి కుడా ప్రాతినిథ్యం చేయటం జరిగింది.