చిలకలడోన లో భక్తిశ్రద్ధలతో దేవర ఉత్సవాలు
1 min read

భారిగా తరలి వచ్చిన భక్తులు
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని చిలకలడోన గ్రామంలో శ్రీ మారికాంబ, దేవమ్మ ల దేవర ఉత్సవాలు గ్రామ పెద్దలు వీఆర్వో రవీంద్ర రెడ్డి, సర్పంచ్ నాగమ్మ, హనుమంతు, ఎంపిటిసి సభ్యులు ఆకుల లక్ష్మి, ఆంజనేయులు, మాజీ సర్పంచులు, వీరశేఖర్ రెడ్డి అధ్వర్యంలో బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్ల దేవాలయాల ను వివిద రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దేవర పురస్కరించుకుని గ్రామ ప్రజలు తెల్లవారుజామున నుండి మహిళలు, యువతులు కుంభాలతో కలశములతో గ్రామ పురవీధుల గుండా డప్పుల బాణాసంచా కాల్చి అమ్మవార్ల దేవాలయాల వరకు ఊరేగింపు గా వెళ్లి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రామాంజులు ఆధ్వర్యంలో మంత్రాలయం ఎస్సై మల్లికార్జున తన పోలీస్ సిబ్బంది తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

