రాఘవేంద్రుని సన్నిధి లో కన్నడ సినీ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి దంపతులు
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు కన్నడ సినీ నటుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి దంపతులు బుధవారం వచ్చారు. వీరికి మఠం అధికారులు స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరి కి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి మెమోంటో తో ఆశీర్వదించారు.

