ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధిపై అవగాహన సదస్సు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమము పై అవగాహన సదస్సు మరియు వర్క్ షాప్ ను ఉద్యానభవన్, ఏ క్యాంప్, కర్నూల్ లో జరిగినది. కర్నూలు మరియు నంద్యాల జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు,రైతు ఉత్పత్తిదారుల సంఘాలు,ఎగుమతి దారులు సదస్సులో పాల్గొనటం జరిగినది. ఈ సదస్సులో డాక్టర్. వై. విద్యాశంకర్, జాయింట్ ఆక్టర్ హార్టికల్చర్ రిటైర్డ్ మరియు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఈ కార్యక్రమానికి నోడల్ ఏజెన్సీ అని రాష్ట్రస్థాయిలో ఉద్యాన శాఖ రాష్ట్ర ఉద్యాన మిషన్ ప్రాజెక్ట్ ఈ నిర్వహణ బాధ్యత వహిస్తుందనీ తెలిపారు. ఈ క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం లో ఎంపిక చేసిన క్లస్టర్లు, అంతర్జాతీయంగా పోటీపడే విధంగా క్లస్టర్ల సమగ్ర అభివృద్ధికి పథకాలు అమలుకు ఈ క్లస్టర్ అభివృద్ధి పథకం ద్వారా సహకారం లభిస్తుందని తెలిపారు. ఈ క్లస్టర్ల సమగ్ర అభివృద్ధి మూడు దశలలో అనగా మొదటి దశలో పంట విత్తనం మొదలు పంట కోత వరకు, రెండవ దశలో పంట కోత నుండి కోత అనంతర యాజమాన్యం ప్రాసెసింగ్ నిల్వ ప్యాకేజింగ్ లో చేపట్టే కార్యక్రమాలు, మూడవ దశలో క్లస్టర్ ఉత్పత్తులను మార్కెట్లతో అనుసంధానం చేయడం, లాజిస్టిక్ బ్రాండింగ్ వినియోగదారుల దగ్గర కు చేర్చడం అనే కార్యక్రమాలు చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు.ప్రాజెక్టు నిర్వహణ సంస్థలకు రావలసిన నిధులు ఆర్థిక సహాయం నేరుగా నిర్వహణ సంస్థల ఖాతాలకు నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ సురక్ష పోర్టల్ ద్వారా మూడు విడతలలో ఆన్లైన్లో ప్రాజెక్టులో పొందుపరిచిన కార్యక్రమాల అమలు మేరకు 9, 18, 36 నెలలకు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్లస్టర్ల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం కన్సల్టెంట్ శ్రీ వైవిధ్యాశంకర్ , కర్నూలు జిల్లా ఉద్యాన అధికారి ఏ రాజాకృష్ణారెడ్డి నంద్యాల జిల్లా ఉద్యాన అధికారి యు నాగరాజు కర్నూలు జిల్లా నాబార్డ్ సుబ్బారెడ్డి నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరక్టర్ (నాన్ అఫీషియో) శ్రీ సింగం సోమశేఖర్ , కర్నూల్ మరియు నంద్యాల జిల్లాల ఉద్యాన అధికారులు, ఉద్యాన అధికారులు, పారిశ్రామికవేత్తలు వ్యాపారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల మెంబర్లు, రైతులు పాల్గొన్నారు.


