ధనాపురం ..హోళగుంద మార్గం కు డబుల్ లేన్ రోడ్డు వేయండి..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : డివిజన్ కేంద్రం ఆదోని కు అనుసంధానం చేయు ధనాపురం హోళగుంద రోడ్డు దుర్భరంగా ఉండటంతో హొలగుందమండల ప్రజలు రాజ్యాంగంచే కల్పించబడ్డ జీవించే, వృత్తి, ఉన్నత విద్య అభ్యసించే, పౌష్టికరమైన ఆహారం పొందే హక్కును కోల్పోతున్నారు. కావున ధనాపురం హోళగుంద మార్గం ను డబుల్ లేన్ రోడ్డుగా మంజూరు చేసి నూతనంగా నిర్మించడానికై వినతి గురించి 17 గ్రామ పంచాయతీలు 21 గ్రామాలను కలిగి దాదాపు ఒక లక్ష జనాభా ఉన్న హోళగుంద మండల ప్రజలైన మేము కోరుతున్నది ఏమిటంటే మేము ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్ అయిన ఆదోనికి రావడానికి హోళగుంద -ధనాపురంను అనుసంధానం చేయు రోడ్డు 25 కిలోమీటర్ల తక్కువ దూరాన్ని కలిగి ఉన్న మార్గం. ఈ మార్గాన్ని మేము డివిజన్ లో ఉన్న ప్రభుత్వ, విద్య, వైద్య, వ్యాపార మొదలగు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో కార్యకలాపాలు నిర్వహించడానికి ఉపయోగిస్తాము. అయితే కొన్ని దశాబ్దాల నుంచి ఈ మార్గం చెడిపోయివున్నది. దీన్ని యింత వరకు పట్టించుకొని నూతన మార్గం నిర్మించే దాఖలాలు కనిపించడంలేదు డబుల్ లేన్ నిర్మించమని ఎన్నో సార్లు మండల ప్రజలు ప్రభుత్వానికి వివిధ రకాలుగా నిరసనలు తెలిపి విన్నపించుకున్న ఇప్పటి వరకు ప్రభుత్వాల్లో చలనం లేదు. ఈ మార్గం సరిగా లేనందున అత్యవసరంగా వైద్య పరంగా ఆదోని వెళ్ళి చికిత్స చేయించుకోవాలన్న ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అత్యవసర పరిస్థితులలో ప్రాణాలకు గ్యారెంటీ లేని 30 కిలోమీటర్ల ప్రయానానికి 2 గంటల సమయం పట్టే పరిస్థితి. ఇలా ప్రయత్నించి ఆదోని ప్రభుత్వ వైద్య ఆసుపత్రికి చేరుకునే లోపు మార్గం మద్యలో తమ ప్రాణాలను కోల్పోయినవారు ఎందరో. గత సంవత్సరం హొలగుంద గ్రామానికి చెందిన షేక్ లాల్ బీ W/o షేక్ నూరి అను గర్భిణి మహిళ ఆదోని కి కేరుకునేలోపే తన ప్రాణాలను కోల్పోయింది. ఇదే రోడ్డుమార్గం లో మోకాలి లోతుగా ఏర్పడిన గుంతల్లో అదుపుతప్పి మోటార్ సైకిల్ పైనుండి కింద పడి సిద్ధమల్ల అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విధంగా ప్రజలు రాజ్యాంగంలోని 21 వ అధికరణ ప్రకారం కల్పించబడిన జీవించే హక్కును కోల్పోతున్నారు. మరియు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రకారం ప్రతి పౌరుడు నాణ్యమైన వైద్యం పొందడం వారి ప్రాథమిక హక్కు, మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు వైద్యం పొందే ఈ హక్కును కూడా కోల్పోతున్నారు.మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల మేము ఎంతో కష్టపడుతూ మా యొక్క ఎన్నో హక్కులను కోల్పోతున్నాము. కనుక ఇందుకు మేము మిమ్ములను కోరేదేమనగా వీలైనంత త్వరగా డబుల్ లేన్ నిర్మించడానికి అవసరమైన అనుమతులను మరియు నిధులను మంజూరు చేసి రోడ్డును నిర్మించి మా హక్కులను కాపాడి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము,


