ఉత్తమ ఉపాధ్యాయురాలు గా కె.రాణి ఎంపిక
1 min read

22 సంవత్సరాలుగా విద్యా శాఖలో విశిష్ట సేవలు
ఎంతోమంది విద్యార్థినీ, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత
ఏలూరుజిల్లా న్యూస్ నేడు: ఏలూరు మండలం శనివారం పేట ఎంపీపీ స్కూల్-2 ఉత్తమ ఉపాధ్యాయురాలు గా పనిచేస్తున్న శ్రీమతి కె.రాణి ఎంపికయ్యారు.శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సన్మాన సత్కార కార్యక్రమాన్నిమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో వి.శ్రీలత, మండల ప్రజాపరిషత్తు అధ్యక్షులు పెన్మచ్చ శ్రీనివాసరాజు, ఎంఈఓ లు ప్రకాష్, అరుణ్ కూమార్ విచ్చేసి పూల బొకేలు అందించి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.రాణి విద్యా శాఖలో ఉపాధ్యాయురాలు గా 22 సంవత్సరాలు విద్యా శాఖకు విశిష్ట సేవలు అందించి. ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది. వారు భవిష్యత్తులో మరింత గా రాణించేలా ఉన్నత విద్యను అభ్యసించేలా ఉన్నత శిఖరాలు అందుకునేలా తీర్చిదిద్దారు. రాణి అభినందన సభకు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, బందు మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని పుష్పగుచ్చాలు అందించి. శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఆమె విద్యాశాఖలో పని చేసిన పాఠశాలల పనితీరును, క్రమశిక్షణను ఎంతోమంది విద్యార్థిని,విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఆమెకే దక్కిందని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది ప్రశంసిస్తూ హర్ష ధ్వనులతో కొనియాడారు.

