డా. బీఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పై స్ధల వివాదం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కే. మార్కాపురం గ్రామంలో డాక్టర్. బీఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో స్వల్ప స్థల వివాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని దళితులు నిర్ణయం తీసుకున్నారు. విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో ఎస్సీ కాలనీ వాసుల మద్య ఏకాభిప్రాయం కలగలేదు. ఇరవై సంవత్సరాల నుంచి చిన్న బంకు వేసుకొని జీవనం సాగిస్తున్న గిడ్డయ్య కు చెందిన బంకు ఉన్న స్థలంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కొందరు పట్టుపట్టారని గిడ్డయ్య భార్య ఈశ్వరమ్మ వారి బందువులు తెలిపారు. బంకు తీసివేస్తే తాము జీవనోపాధి కొల్పొతామని అనుకూలంగా ఉన్న వేరే చోట అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఈశ్వరమ్మ కోరారు. అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు చేయడానికి తాము వ్యతిరేకం కాదని వారు తెలిపారు. అధికారులు చోరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలోమాజీ సర్పంచ్.కళ్లు పెద్ద అయ్యన్న,.కొమ్ము పెద్ద పక్కిరన్న, ఆర్. నాగేశ్వరరావు, కళ్లు సురేంద్ర.అకేపోగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.