NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు విశిష్ట సేవలు

1 min read

పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులకు ఘనంగా సన్మాన కార్యక్రమo

రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా తగిన చర్యలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: మే నెల లో  ఏలూరు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తు పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులకు సన్మాన కార్యక్రమo ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా పోలీస్ శాఖ లో సుదీర్ఘ కాలం పాటు విశిష్ట సేవలు అందించి, మే 2026 నెలలో పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు పోలీస్ అధి కారులకు ఘన వీడ్కో లు పలికేందుకు నిశ్చ యించడమైనది. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల పై ఏఆర్ అదనపు ఎస్పీ జి.ముని రాజా ఆధ్వర్యంలో ది. 30. 05.2026 న జిల్లా పోలీస్ ప్రధాన కార్యా లయంలోని సమావేశ మందిరం నందు ఈ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించరు. పదవీ విరమణ పొందుతున్న అధికారుల వివరాలు,మర్రి సత్య నారాయణ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్  డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ (డిఎఆర్), ఏలూరు కె.ఆంజనేయులు అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్  డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజర్వ్  ఏలూరుఎమ్.అర్లప్ప  హెడ్ కానిస్టేబుల్ 4103  నూజివీడు పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ చేయనున్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ  జి.మునిరాజా మాట్లాడుతూ దశా బ్దాల పాటు పోలీస్ శాఖలో ఎన్నో సవాళ్ల ను ఎదుర్కొంటూ, శాంతి భద్రతల పరిరక్షణలో మరియు ప్రజల రక్షణలో ఈ అధికారులు చూపిన అంకితభావం,క్రమ శిక్షణ ఎనలేనివని కోనియడారు.పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ తమ సుదీర్ఘ సర్వీసులో జిల్లా పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలను పెంచేలా పనిచేసి నందుకు  ఏలూరు ఎస్పీ  తరపున మరియు ఉన్నతాధి కారుల తరపున ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. పదవీ విరమణ అనేది ఒక బాధ్యత నుండి మరొక కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం లాంటిది. శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా,ప్రశాంతంగా విశ్రాంతితో ఆరోగ్యం గా గడపాలని పోలీస్ శాఖ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోందని తెలిపారు. పదవీ విరమణ పొందుతున్న అధికారులకు అందవలసిన ప్రభుత్వ నిధులు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా తగిన చర్యలు తీసుకోవడం జరుగు తుందని ఉన్నతాధికారులు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో పదవి విరమణ చేస్తున్నటువంటి అధికారులకు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై  పోలీస్ అధికారులు కోపరేటివ్ సంఘంలో పొదుపు చేసినటువంటి డబ్బుల చెక్కులను అధికారులకు  ఏఆర్ అదనపు ఎస్పీ అందజేసినారు.ఈ కార్యక్రమంలో ఏ ఓ షేక్ మస్తాన్, పోలీస్ ప్రధాన కార్యా లయం సూపరిం టెండెంట్ లు నాగేశ్వర రావు, సువర్చల, ఇన్స్పెక్టర్ బాల కృష్ణ ,ఏఆర్ ఆర్ ఐ.పవన్ కుమార్, సతీష్ , ఆర్ఎస్ఐ లు ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు పోలీస్ సిబ్బంది మరియు పదవీ విరమణ చేస్తున్న అధికారుల యొక్క కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Author