ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవం
1 min read
సిఐటియు జెండాను ఆవిష్కరించిన మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర
న్యూస్ నేడు, పత్తికొండ: సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం పత్తికొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఉన్న సిఐటియు కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల అధ్యక్షులు డి గోపాల్ అధ్యక్షతన వహించగా సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర జండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు మాజీ జిల్లా నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు దస్తగిరి మాట్లాడుతూ, కార్మిక సంఘాల హక్కులను పరిరక్షించడానికి సిఐటియు సంఘం పనిచేస్తుందని, దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘం సిఐటియు అని అన్నారు. దాదాపుగా 70 నుంచి 80 లక్షల మంది ఉన్న కార్మిక సంఘం కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘం సిఐటియు అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని వెంటనే కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను పునరుద్ధరించాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. 1970 మే 30 తారీఖున దేశంలో సిఐటియు కార్మిక సంఘం జెండా రెపరెపలాడిందని 56 సంవత్సరాల నుండి సీఐటీయూ కార్మికుల కోసం అలుపెరగని పోరాటం చేస్తుందని వారు కొనియాడారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే కార్మికులు కర్షకులు కష్టజీవుల కోసం అధికారంలో ఉన్న పార్టీలు వారికోసం పాటుపడాలని కార్మికులు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని కార్మికుల కష్టాన్ని దోచుకునే ప్రభుత్వాలు ఉన్నంతకాలం దేశం అతలాకుతలమవుతుందని కార్మికుల కోసం కనీసం సబ్సిడీ లోన్లు కూడా వదలని కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీల కంపెనీలకు వేల కోట్లు రుణమాఫీలు చేస్తుంది.

