NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిసెంబర్ నాటికి 1,920 టిడ్కో ఇళ్ల పంపిణీ

1 min read

500 ఎంఎల్‌డీ సంపు నిర్మాణానికి ఎమ్మెల్యే బడేటి చంటి శంకుస్థాపన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. పోణంగి రోడ్డులోని టిడ్కో గృహ సముదాయంలో 500 ఎంఎల్‌డీ ఎస్‌ఎల్‌ఆర్‌ సంపు నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. టిడ్కో గృహాల నిర్మాణాలను ఎమ్మెల్యే పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ పనులను మరింత వేగవంతం చేసి లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అక్టోబర్ నాటికి కొంతమంది లబ్ధిదారులకు ఇళ్లను, డిసెంబర్ నెలాఖరులోగా 40 టవర్లలోని 1,920 టిడ్కో గృహాలను అన్ని మౌలిక సదుపాయాలతో అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని, గతంలో నిలిచిపోయిన టిడ్కో ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి పేదలకు ఇళ్లు అందించేందుకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *