పి జి ఆర్ ఎస్ లో దరఖాస్తు.. స్పందించిన జిల్లా కలెక్టర్
1 min read
శారీరక విభిన్న ప్రతిభావంతులయిన వారికి బ్యాటరీ వాహనం పంపిణీ
చిరు వ్యాపారం చేసుకునే వీరవల్లి శంకరరావుకు మూడు చక్ర్రాల బ్యాటరీ వాహనాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రి సెల్వి అందజేశారు
ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని కలెక్టర్ సూచన
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సోమవారం:జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో శారీరక విభిన్న ప్రతిభావంతులయిన జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు వీరవల్లి శంకర రావు రూ 65 వేలు విలువచేసే మూడు చక్ర్రాల బ్యాటరీ వాహనాన్ని జిల్లా కలెక్టరు ఉచిత పంపిణీ చేశారు.మూడు చక్రాల బ్యాటరీ వాహనాన్ని మంజూరు చేయవలసినదిగా కోరుచూ పిజిఆర్ యస్ కార్యక్రమము నందు గతంలో అర్జీ సమర్పించుట జరిగింది. దీంతో జిల్లా కలెక్టరు స్పందించి మూడు చక్రాలు వాహనాన్ని మంజూరు చేసి ఈ రోజు పంపిణీ చేయుట జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ మూడు చక్రాల బ్యాటరీ వాహనం ద్వారా చిరు వ్యాపారాలు చేసుకుని కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని జిల్లా కలెక్టరు కె.వెట్రి సెల్వి సూచించారు.మూడు చక్ర్రాల బ్యాటరీ వాహనం ఉచిత అందజేసినందులకు వీరవల్లి శంకరరావు జిల్లా కలెక్టరుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.