PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్

1 min read

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం..

రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తాం..

ఇప్పటికే రైతుల నుండి 1. 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షపు నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేపడతామని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు   భారీ వర్షాల కారణంగా జిల్లా ఆసుపత్రి వర్షపు నీటి ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సుమారు 7,8 దశాబ్దాల క్రితం నిర్మించిన కట్టడమని, లోతట్టు ప్రాంతంలో ఉండడంతో తరచూ భారీ వర్షాలు, వరదల సమయంలో ఆసుపత్రి పరిసరాలు ముంపునకు గురవుతున్నాయన్నారు.  ప్రస్తుతం ఆసుపత్రి వైద్యాధికారులు ఆసుపత్రి ప్రాంగణంలో చేరిన చేరిన వర్షపు నీటిని  మంగళవారం ఉదయం నుండి వర్షపు నీటి ని మోటరుతో బయటకు పంపుతున్నారన్నారు. గంట సమయంలో  వర్షపు నీరంతా బయటకు పంపించడం జరుగుతుందన్నారు.  అయినప్పటికీ  ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తగిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.  ఈ సందర్భంగా తనని కలిసిన   పాత్రికేయులతో కలెక్టర్ మాట్లాడుతూ  తూఫాన్ నెల్లూరు, బాపట్ల  మధ్యలో వాయుగుండం తీరం దాటనున్న దృష్ట్యా  రానున్న రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లా లో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ఇందుకోసం మండల స్థాయిలో రాపిడ్ యాక్షన్ బృందాలను ఏర్పాటుచేశామని, ఈ బృందంలో మండల స్థాయిలోని  తహసీల్దార్, ఎంపిడిఓ, రహదారులు,భవనాలు శాఖ, విద్యుత్ శాఖ, పంచాతీరాజ్ శాఖాధికారులు ఉంటారన్నారు.  ఈ బృందం మండలంలో ప్రజలకు సహాయక చర్యలతో పాటు, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కూలిపోయిన  చెట్లు, స్థంబాలు తొలగించడం, రవాణా సౌకర్యం పునరుద్ధరించడం, పారిశుధ్యం వంటి చర్యలు తీసుకుంటారన్నారు.   ఖరీఫ్ సీజన్లో సోమవారం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతుల వద్ద మరో 10  వేల  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా సేకరించడం జరిగిందన్నారు.  జిల్లాలో ఎక్కడైనా రైతుల వద్ద  ధాన్యం మిగిలిపోతే వెంటనే దగ్గరలోని ఆర్బీకే కేంద్రాలకు తెలియజేస్తే వెంటనే సేకరిస్తారన్నారు.  ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని, రైతుల నుండి పూర్తి స్థాయిలో ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తుందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్  చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట మునిసిపల్ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, ఆర్డీఓ ఎన్ . ఎస్ కె. ఖాజావలి , జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయాధికారి   పాల్ సతీష్ కుమార్ ,  ఆసుపత్రి సూపరింటెండెంట్ అగ్నస్ విజయ,  ఆర్ ఎం ఓ  డి. ఆర్. ప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ సోమశేఖర్, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author