NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బనవాసి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : బుధవారం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ డా.ఎ. సిరి సందర్శించారు. ఈ సందర్భంగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాఘవేంద్ర చౌదరి కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్న పరిశోధనలు, రైతుల కోసం అమలు చేస్తున్న సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శనల ఫలితాలు మరియు జిల్లా వ్యవసాయ అభివృద్ధికి కేవీకే చేస్తున్న కృషిని వివరిస్తూ సవివరంగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ శాస్త్రవేత్తలతో  చర్చించి, పంటలలో కొత్త సాంకేతికతలు, వాతావరణ మార్పులు–పంట నిర్వహణ, నీటి సంరక్షణ, పోషక నిర్వహణ, పురుగుల సమగ్ర నిర్వహణ వంటి ముఖ్య అంశాలపై జిల్లాకు అనువైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించే దిశగా సూచనలు చేశారు.రైతులకు ప్రత్యక్ష లాభం చేకూరే విధంగా ప్రాంగణ ప్రదర్శనలు, ఫీల్డ్ విజిట్లు, డిజిటల్ ఎక్స్టెన్షన్ సేవలను మరింత విస్తరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వ్యవసాయ–తోటల రంగ సామర్థ్యాన్ని పెంచడానికి కేవీకే, వ్యవసాయ శాఖ, తోటల శాఖ మరియు మైదాన స్థాయి అధికారులతో సమన్వయం పెంచాలని వెల్లడించారు. కేవీకే తీసుకుంటున్న నవీన కార్యక్రమాలను అభినందిస్తూ, భవిష్యత్‌లో మరింత ప్రభావవంతమైన సాంకేతిక సేవలు అందించాలన్నారు. ఈ సందర్శనలో  సమన్వయకర్త డాక్టర్ కే. రాఘవేంద్ర చౌదరి, ఏడీఏ  మొహమ్మద్ ఖాద్రి, యెమ్మిగనూరు ఏఓ శివశంకర్ , ఉద్యానవన శాఖ  అధికారి బి. శ్రీ వాణి  మరియు కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

About Author