మొండి బకాయిదారులపై ఉదాసీనత వైఖరి వీడండి
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
ప్రతి రోజూ 2 డిస్ట్రెస్ వారెంట్లు జారీ చేయండి
ప్రతి రోజూ ఏసి, డిసి, నోడల్ అధికారులు పర్యవేక్షించాలి
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం నగరంలో సంవత్సరాల తరబడి లక్షల రూపాయల పన్నులు చెల్లించకుండా మొండి బకాయిదారులుగా మారిన వారిపై ఉదాసీనత వైఖరి వీడి, వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి, ఆర్వోలు, నోడల్ అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో మొండి బకాయిలను రాబట్టేందుకు అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, నోడల్ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ పెట్టాలని, వారివారి పరిధిలో ఉన్న మొండి బకాయిదారులకు తక్షణమే రెడ్‌నోటీసులు జారీ చేయాలని సూచించారు. అయినప్పటికీ స్పందన లభించని వారికి డిస్ట్రెస్ వారెంట్లు జారీ చేసి, వారంలోపు చెల్లించకపోతే ఆస్తుల జప్తు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ బకాయిలు, వినోద పన్నుల వసూళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జివి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్ రెడ్డి, ఆర్వోలు జునైద్, వాజీద్, ఎం.హెచ్.ఓ నాగశివప్రసాద్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ అంజాద్ బాష తదితరులు పాల్గొన్నారు.

