రైతన్నలకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం చేపట్టిన “రైతన్నా..మీకోసం
1 min read

పెదవేగి మండలం విజయిరాయి లోని రైతు సేవ కేంద్రం వద్ద రైతన్నలతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ ప్రారంభం కూటమి ప్రభుత్వం చేపట్టిన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రైతన్నకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం దెందులూరు ఎమ్మెల్యే చింతన ప్రభాకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతన్న మీకోసం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను రైతులకు, స్థానిక ఉద్యానవన విద్యార్థులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా అందజేసి రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడం కోసం రైతులు చేపట్టవలసిన నూతన మార్పులను సైతం వివరించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “రైతులకు వ్యవసాయాన్ని గిట్టుబాటుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పంచ సూత్రాలను అమలు చేస్తుందని, వీటిపై ఇప్పటికే గ్రామస్థాయిలో రైతులకు వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దెందులూరు నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణాన్ని మరింతగా పెంచేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని విధాల అండగా నిలుస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, రైతులు, పలువుల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

