PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుప్రీం కోర్టు ఎదుట సంచలన ఘటన

1 min read


పల్లెవెలుగు వెబ్: సుప్రీం కోర్టు ఎదుట సంచలన ఘటన చోటుచేసుకుంది. ఓ జిల్లాకు చెందిన జడ్జి నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట తన చొక్కా విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఓ కేసు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు గేటు ఎదుట నిరసన చేస్తున్న వ్యక్తిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతని దగ్గరకు వచ్చి ఆరా తీస్తే.. ఓ జిల్లాకు చెందిన జడ్జిగా తెలిసింది. దీంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది నిరసన ఆపాలని విజ్ఞప్తి చేశారు. అయినా అతను తన నిరసనను కొనసాగించాడు. అరగంట తరువాత సెక్యూరిటీ సిబ్బంది జడ్జిని బతిమలాడటంతో నిరసనను విరమించారు. అయితే ఆ జడ్జి వివరాలు మాత్రం బయటకు తెలియాల్సి ఉంది.

About Author