హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కాంగ్రెస్ ఆలూరు ఇన్చార్జి లక్ష్మీనారాయణ దారుణ హత్య నేపథ్యంలో హత్య జరిగిన సంఘటన స్థలాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సోమవారం పరిశీలించారు. ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (60) ఆదివారం దారుణహత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి స్వగ్రామమైన కర్నూలు జిల్లా చిప్పగిరికి కారులో వెళుతుండగా గుంతకల్లు పట్టణ శివారులోని చిప్పగిరి రైల్వే బ్రిడ్జి స్పీడ్ బ్రేకర్ వద్ద గుర్తు తెలియని దుండగులు (ఏపీ03 వై 1899) టిప్పర్ తో కారును వేగంగా ఢీకొట్టి లక్ష్మీనారాయణను ఆదివారం హత్యకు గురి చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాల పై జిల్లా ఎస్పీ ఆరా తీశారు. జిల్లా ఎస్పీ తో పాటు ఆదోని ఒన్ టౌన్ సిఐ శ్రీరామ్, చిప్పగిరి ఎస్సై సతీష్ , మంత్రాలయం ఎస్సై శివాంజల్ ఉన్నారు.