రాఘవేంద్రుని సన్నిధి లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం వచ్చారు. వీరికి మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట శ్రీ మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి స్వామి, ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్ర బాబు, మంత్రాలయం ఎస్ఐ శివాంజల్, ఎస్బీ ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, హెడ్ కానిస్టేబుళ్ రాఘవేంద్ర తదితరులు ఉన్నారు.