మునిసిపల్ ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు …
1 min read
నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి.
ఎన్నికల బందోబస్తు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన …
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.
కర్నూలు,న్యూస్ నేడు: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా , స్వేచ్ఛగా , నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ సూచించారు.ఈ సందర్భంగా శనివారం గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని అథీనా స్కూల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులు, సాయుధ బలగాలు, సిబ్బందికి ఎన్నికల విధుల పై దిశానిర్దేశం చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కొనసాగించాలని ఆదేశించారు.సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ శ్రీ హనుమంతు , అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా, డిఎస్పీలు శ్రీ రాఘవేంద్ర, శ్రీ దుర్గ ప్రసాద్ , సీఐలు, ఎస్సైలు, సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.


