NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలను ఆరోగ్యవంతులుగా చేయడం మనందరి బాధ్యత

1 min read

వెలుగోడు , న్యూస్​ నేడు:  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ జిల్లా ఎన్సిడిఆర్టి ఎన్కె ప్రోగ్రాం అధికారి అనిల్ కుమార్ రెడ్డి శనివారం వెలుగోడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఓపి రిజిస్టర్లు మరియు స్టాక్ రిజిస్టర్లు తనిఖీ చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్లినిక్ లో అశంస్రామిక వ్యాధుల పేషెంట్లకు అందుతున్న సేవలు, చికిత్సలు మరియు రెగ్యులర్గా వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రతివారము  క్లినిక్ లో అందిస్తున్న సేవలు ,  అవసరమైన ల్యాబ్ పరీక్షలు , చికిత్సలు, గుర్తించిన అనుమానాస్పద రొమ్ము, గొంతు, గర్భాశయ, ముఖ క్యాన్సర్ కేసుల వివరాలు , నిర్ధారణ పరీక్షలు, గుర్తించిన వివరాలు, వారికి అందుతున్న చికిత్సలు, పర్యవేక్షణ , ఉచిత మందుల పంపిణీ గురించి వైద్యులు ఎన్సీడీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శామీర్ , గైనకాలజిస్ట్ డాక్టర్ సింధు ప్రియ, జనరల్ మెడిసిన్ డాక్టర్ దాదావలి, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ భాస్కర్, స్టాప్ నర్సులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ సి డి కార్యక్రమం కింద పేషెంట్లకు అవసరమైన మందుల సరఫరా గురించి వైద్యులు ప్రోగ్రామ్ అధికారిని అడగగా త్వరలో ఎన్సీడీ పేషెంట్లకు ఇచ్చే మందులు సెపరేట్గా వస్తాయని తెలియజేస్తూ అన్ని రకాల జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అవగాహన సదస్సులు అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కూడా నిర్వహించాలని అక్టోబర్ 28 నుండి 60 రోజులపాటు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పొగాకు రహిత యువత కార్యక్రమము మరియు నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే బ్రిక్స్ సుస్థిర ఆరోగ్య జీవన శైలి వారోత్సవాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్సీడీ సర్వే, ఆర్బిఎస్ కే కార్యక్రమం కింద అంగన్వాడీ కేంద్రాలలో నవచేతన యాప్ ద్వారా చేసిన చిన్నారుల ఆరోగ్య పరీక్షల వివరాలు, గుర్తించిన వ్యాధుల నిర్ధారణ కేసులు , నాలుగు రకాల వ్యాధుల కేసుల వివరాలు వారికి చేసిన నిర్ధారణ పరీక్షలు, జిల్లా సత్వర చికిత్స కేంద్రం కు రెఫర్ చేసిన కేసులు మరియు పాఠశాలలో విద్యార్థులకు చేసిన ఆరోగ్య పరీక్ష వివరాలు, రెఫర్ చికిత్సల వివరాలు, ప్రతి గురువారం చేసే ఐరన్ పోలిక్ బ్లూ కలర్ మాత్రల పంపిణీ గురించి వైద్యాధికారి డాక్టర్ సుధా ప్రణతి , హెల్త్ సూపర్వైజర్ శ్రీదేవి ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటరమణ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *