డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ బూత్‌ల పరిశీలన
1 min read
కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి :అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లో ఆదివారం జరగ నున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యం లో మదనపల్లె జడ్పీ హైస్కూల్ పాటు బాలికల కళాశాల నందు పోలింగ్ బూత్‌లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిస్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారుల కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచి ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటు వేసేలా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ బి. ప్రసాద్, సీఐలు మోహన్ కుమార్, గోపాల్ రెడ్డి, ఎస్బీ సీఐ సదాశివయ్యతో పాటు పలువురు పోలీసు అధి కారులు పాల్గొ న్నారు.


